Oct 14,2023 08:14

నిద్దుర పోని యుద్ధ మేఘాలు
నిద్ర రాని లక్షల అశ్రు నయనాలు
పిడుగులు వర్షించే మారణాయుధాలు
పేక మేడలుగా కూలె పెద్ద నగరాలు...!
మానవత్వాన్ని మరచి
దానవత్వాన్ని కరచి ఇరు దేశాలు
దారుణ మారణకాండకు దిగాయి...!!
కారణం లేని రణ రంగంలో
అపారమైన ఆర్థిక నష్టం
వేలాది మంది మరణం
లక్షలాది జనత క్షతగాత్రం
దేశ ప్రగతి తిరోగమనం....!?
ఇరు దేశాల యుద్ధం నేపథ్యం
తరతరాల ఆధిపత్య పోరు
రాజ్య కాంక్ష విస్తరణ హోరు..!
ఇద్దరూ అహంకారాలు వీడి
యుద్ధ శంఖారావాలకు స్వస్తి పలకాలి ..!
ఉభయులు స్నేహ హస్తాలు చాచి
శాంతి కపోతాలను ఎగురు వేయాలి..!
అప్పుడే ప్రపంచానికి ఉప శాంతి
నిఖిల మానవాళికి విశ్వ శాంతి...!
 

- జి. సూర్యనారాయణ, దివిసీమ.