Dec 18,2022 13:39

సత్యవేడు (తిరుపతి) : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం సిరణంబూదూరు గ్రామానికి సమీపంలో తెలుగు గంగ నీటిలో గుర్తుతెలియని మహిళ శవం కొట్టుకుపోతున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. మహిళ వయసు దాదాపు 50 సంవత్సరాలు ఉంటుందని.. నలుపు జాకెట్‌ తొడిగి ఉన్నట్టు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.