Aug 29,2023 12:38

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ... తెలుగు అధికార భాష దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక జడ్పీ ఆవరణలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్‌ మాట్లాడుతూ ... తెలుగు అధికార భాష దినోత్సవం సందర్భంగా, తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ''మా తెలుగు తల్లికి మల్లెపూదండ'' బాల్యం నుండి రాష్ట్రీయ గీతాన్ని ఆలాపిస్తున్నామని అన్నారు. ప్రతి ఏడాది తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. అంతర్జాతీయంగా ఆంగ్ల భాషకు ఉన్న విలువను బట్టి తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గుతున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. అందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాష ప్రాముఖ్యత చాటి చెప్పే క్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ,తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, జడ్పీ సీఈవో జ్యోతి బసు, జడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు.