
రంగారెడ్డి (తెలంగాణ) : లండన్‌లో తెలుగు యువతి హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని రెడ్డి (27)పై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తేజస్విని ఎంఎస్ కోసం తన స్నేహితులతో కలిసి లండన్‌లో ఉంటున్నారు. రెండు నెలల క్రితమే తేజస్విని ఎంఎస్ పూర్తిచేశారు. త్వరలో ఆమె స్వదేశానికి రావాల్సి ఉంది. ఇంతలో.. ఘోరం జరిగింది. నిందితుడు తేజస్వినిపై కత్తితో దాడి చేసి ఆమె స్నేహితురాలిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో తేజస్విని అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితురాలికి తీవ్రగాయాలయ్యాయి.