Oct 17,2023 14:45

ప్రజాశక్తి-ఆలమూరు(అంబేద్కర్‌ కోనసీమ) : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యంను రాజ్యాంగ విరుద్ధంగా గృహ నిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామిక చర్యని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నారా భువనేశ్వరిని పరామర్శ చేయడానికి వెళుతున్న సందర్భంగా రవీంద్రను రాజమండ్రి కేంద్ర కారాగారం ముట్టడికి పార్టీ ఇచ్చిన పిలుపును అడ్డుకోవడానికి పోలీసులు నేతలును అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీ నేతలును పధకం ప్రకారమే ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోందని, రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కి అప్రజాస్వామిక విధానాలతో పాలన చేస్తున్న వైసీపీ పార్టీకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని తెలిపారు.