Jun 08,2023 12:10

ప్రజాశక్తి-అమరావతి(గుంటూరు) : అమరావతి కమ్యూనిటీ వైద్యశాలను డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బి వి.రంగారావు ఆకస్మికంగా బుధవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బి వి.రంగారావు ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. 24 గంటలు రోగులకు వైద్యులు, రక్త పరీక్షల సిబ్బంది, మెడిసిన్‌ విభాగ సిబ్బంది అందుబాటులో ఉంటున్నార లేదా అని అడిగి తెలుసుకున్నారు. మరికొందరు రోగులు తమకు శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించారని డిసిహెచ్‌ ఎస్‌ డాక్టర్‌ బి వి.రంగారావుకు తెలిపారు. దీంతో ఆయన ఆసుపత్రి సూపర్డెంట్‌ డాక్టర్‌ చందులాల్‌. నాయక్‌ తో మాట్లాడుతూ ఆసుపత్రి పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కాన్పులు మరింత పెరిగేలా చేయాలని గతంలో సీ గ్రేడ్‌ ఉన్న ఆసుపత్రిని నేటి ఏ గ్రేడ్‌ లో ఉంచిన వైద్యులను నర్సులను సిబ్బందిని అభినందించారు. వైద్య సిబ్బంది మరింత కష్టపడి పనిచేసి ఆసుపత్రి అభివద్ధికి కషి చేయాలని కోరారు. త్వరలో బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్‌ తదితర సౌకర్యాలను అందుబాటులో తీసుకొని రావాలని ఆదేశాలను జారీ చేశారు. అనంతరం ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి మరింత మెరుగైన సేవలను రోగులకు అందించాలని వైద్యులను,నర్సులను, సిబ్బందిని కోరారు.ఈ తనిఖీలు ఆసుపత్రి సూపర్డెంట్‌ డాక్టర్‌ చందులాల్‌. నాయక్‌,డా.. హరిబాబు, డా.మహేశ్వరి, డా.త్రివేణి తదితర వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.