Feb 09,2023 13:05

అనంతపురం : ప్రసిద్ధ కవి వసీరాకు 35 వ ఉమ్మడిశెట్టి సత్యా దేవి అవార్డు- 2022కి ఆయన రాసిన 'సెల్ఫీ' కథా సంపుటి ఎంపికైనట్లు అవార్డు వ్యస్థాపకులు డా. రాధేయ గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా రాధేయ మాట్లాడుతూ.. 'ఈ అవార్డు పొందిన వారిలో వసీరా 35వ వారు. ఈ అవార్డుకు ఆయన రాసిన కథాసంపుటి 'సెల్ఫీ' ఎంపిక కావడం పట్ల ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కోప్పర్తి వెంకట రమణమూర్తి, డా. నాళేశ్వరం శంకరం, మందరపు హైమావతి ఈ అవార్డు న్యాయనిర్ణేతలుగా వ్యవహరంచారు. వసీరా గారు రాసిన 'సెల్ఫీ' కవిత్వంలో సమస్త విశ్వాన్నీ ఆలింగనం చేసుకొనే ఒక అద్వితీయ దివ్యానుభవం మనకు కల్గుతుందని న్యాయ నిర్ణేతలు అభిప్రాయ పడ్డారు' అని ఆయన అన్నారు. ఈ అవార్డు త్వరలో అనంతపురం లో జరిగే సభలో కవికి ప్రదానం చేస్తామని రాధేయ చెప్పారు.