ఉక్కు జోలికొచ్చావో - ఢీ అంటే ఢీ
నీ ఆటలింక సాగవులే - జగత్ కిలాడీ / 2 /
తాతల తండ్రుల నెత్తురు - మా విశాఖ ఉక్కు
నేతలు, మంత్రులకెక్కడిది అమ్ముకునే హక్కు / 2 /
// ఉక్కు //
సొంత గనులు సమకూర్చని - సిగ్గులేని తనమా
కాలి కింది నేల మీద - వాడి బోడి పెత్తనమా / 2 /
రొమ్ము చరిచి ప్రశ్నించని - తొత్తు మంత్రులెందుకు
కొమ్ము విరిచి నిలదీయని - భజంత్రీలు మనకెందుకు /2/
// ఉక్కు //
చీమలు పెట్టిన పుట్టలొ - పాములు బుసగొట్టుటయా
తేనె తుట్టె కదిపినట్టు - ఉద్యమ సెగ పుట్టదా / 2 /
ఊరూరా చుట్టుముట్టి - ఉచ్చులు బిగబట్టదా
వల్లకాటి వరకు నిన్ను - వెంట తరిమి కొట్టదా / 2 /
// ఉక్కు //
కదం తొక్కుతోంది చూడు - కర్షక, కార్మిక శక్తి
పదం కలుపుతోంది చూడు - కళాజగతి యుక్తి / 2 /
కలము, గళము, హలము - త్రిశూల కొలుముల మయమై
నాట్య తాండవం ఆడితె - పటాల భస్మీపటలమె / 2 /
- రాజహంస,
సెల్ : 9490263115.










