Oct 06,2023 21:03

బెంగళూరు : దేశంలోని ఎంఎస్‌ఎంఇ ఔత్సాహికవేత్తలకు మద్దతును అందించడానికి ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, హాక్‌దర్శక్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సామాజిక, ఆర్థిక సమ్మేళన సంస్థగా ఉన్న హక్‌దర్శక్‌తో సంయుక్తంగా పని చేస్తూ.. ఆర్థిక అక్షరాస్యత పెంచాలని నిర్దేశించుకున్నట్లు ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బి ఎండి, సిఇఒ ఇట్టిరా డావిస్‌ పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో సుమారు 15,000 మంది వద్దకు చేరుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. ఇందుకోసం ఇరు సంస్థలు కలిసి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించామని హాక్‌దర్శక్‌ సిఇఒ అనికేత్‌ దోగర్‌ పేర్కొన్నారు. అట్టడుగు స్థాయి వ్యవస్థాపకులకు సైతం సాధికారతను అందిచాలనేది తమ లక్ష్యమన్నారు.