నవ్యాంధ్ర రచయితల సంఘం-మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం, ఉగాది పండుగల సందర్భంగా మార్చి 21న మంగళవారం విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో 'ఉగాది ఉత్సవాలు' జరుపుతున్నామని కార్యక్రమనిర్వాహణ కమిటీ సభ్యులు కలిమిశ్రీ, యేమినేని వెంకట రమణ, డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్, కుర్రా సురేష్ బాబు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఉగాది కవి సమ్మేళనం, ఉగాది పురస్కారాలు, కవులు, రచయితలు, కళాకారులకు ఉగాది సత్కారాలు, పుస్తకావిష్కరణలు వుంటాయి. ముఖ్య అతిధిగా గజల్ మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ పాల్గొంటారు. అతిధులుగా మందపాటి శేషగిరిరావు, జి.లక్ష్మీనరసయ్య, కరుమారి దాసు, ఆర్.ఆర్. గాంధీ నాగరాజన్, టి. జమలాపూర్ణమ్మ, అరసవల్లి కృష్ణ, డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, కొల్లూరి పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, మందరపు హైమవతి, అమూల్య చందు, డాక్టర్ ఘంటా విజరు కుమార్, సరికొండ నరసింహరాజు, శిఖా ఆకాష్, రామరాజు లక్ష్మీ శ్రీనివాస్, తంగిరాల సోనీలకు మల్లెతీగ ఉగాది పురస్కారాలు అందజేస్తారు. కవి సమ్మేళనంలో పాల్గొనాలనుకునే కవులు 8332903156 నెంబరులో సంప్రదించవచ్చు.










