Jul 23,2023 09:05

ఉడతా..ఉడతా రావమ్మా
మాతో స్నేహం చేయమ్మా
ఊసులు ఎన్నో చెప్పమ్మా
చక్కని కబుర్లు ఆడమ్మా
గింజలు నీకు ఇస్తాము
దండిగా పండ్లు పెడతాము
మా తోటను నీకు ఇస్తాము

చెట్లు, చేమలు తిరుగుతూ
ఊడలు, తీగలు ఊగుతూ
కొమ్మలు, రెమ్మలు గెంతుతూ
వాగులు, వంకలు దాటుతూ
మాతోనే నీవు తిరుగుతూ
ఆనందంగా గడుపుతూ
కల కాలం కలిసుందాము
కమ్మని స్నేహం మనదందాం !
 

- కయ్యూరు బాలసుబ్రమణ్యం,
77802 77249