Aug 03,2022 20:35

న్యూఢిల్లీ  :  ఫుడ్‌ డెలివరీ సంస్థ జమాటోలో ఇప్పటి వరకు అతిపెద్ద ఇన్వెస్టర్‌గా ఉన్న ఉబర్‌ అనుహ్యాంగా ఆ సంస్థ నుంచి వైదొలిగింది. జొమాటోలో తనకున్న 7.8 శాతం వాటాను దాదాపు రూ.3 వేల కోట్లకు (390 మిలియన్‌ డాలర్లు) ఉబర్‌ విక్రయించింది. జొమాటో షేర్లు పేలవంగా నమోదు కావడంతో గడిచిన తొమ్మిది మాసాల్లో 707 మిలియన్‌ డాలర్లు (రూ.5600 కోట్లు) కోల్పోయినట్టు ఉబర్‌ అంచనా వేస్తోంది. భారత మార్కెట్‌లో స్విగ్గీతో పోటీ పెరిగిపోవడంతో జొమాటో, ఉబర్‌ ఒక్కటయ్యాయి. ఈ ఒప్పందంలో జొమాటోలో 9.99 శాతం వాటాను ఉబర్‌ కొనుగోలు చేసింది.