ఆసియా కప్ 2023 టైటిల్ కోసం శ్రీలంకతో తలపడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. సూపర్-4లో బంగ్లాదేశ్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడింది.టాప్ ఆర్డర్ విఫలమైనా పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. శుభ్‌మన్ గిల్ (121) సెంచరీతో బంగ్లాపై భారత్‌ను గెలిపించేందుకు తీవ్రంగా పోరాడాడు. భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో బంగ్లాపై సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ''బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నా పోరాటం సరిపోలేదు. అయితే, ఫైనల్స్‌కు మాత్రం అంతా సిద్ధంగా ఉంది'' అంటూ గిల్ పోస్టు చేశాడు.
శుభ్‌మన్ గిల్ పెట్టిన పోస్టుకు యువరాజ్‌సింగ్ స్పందించాడు. ''నువ్వు ఔట్ కావడానికి చెత్త షాట్ కారణం. క్రీజ్‌లో ఉంటే తప్పకుండా ఒంటిచేత్తో గెలిపించేవాడివి. అయినప్పటికీ అద్భుతంగా ఆడావు. ఫైనల్‌లో అలాంటి పొరపాటు చేయొద్దు'' అని కామెంట్ చేశాడు.










