బెంగళూరు : దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి కోసం తొలిసారి బయోసిమిలర్ ఇన్సులిన్ అస్పార్ట్ అయినా ఇన్సూక్విక్ విడుదల కోసం బయోజెనోమిక్స్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు యుఎస్‌వి ప్రయివేటు లిమిటెడ్ వెల్లడించింది. మధుమేహం ఉన్నవారి చికిత్స అవకాశాలను ఇది మెరుగుపరుస్తుందని పేర్కొంది. ఇన్సూక్విక్ 100 శాతం భారత్‌లో తయారు చేయబడిందని పేర్కొంది. దేశంలో 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా.