Jul 29,2023 16:38

వాషింగ్టన్‌ :   అమెరికా తైవాన్‌కు 345 మిలియన్‌ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలోభాగంగా తైవాన్‌ ప్రజలకు రక్షణ, విద్య మరియు శిక్షణ ఉంటుందని వైట్‌ హౌస్‌ శుక్రవారం ప్రకటించింది. మాన్‌ పోర్టబుల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ (ఎంఎఎన్‌పిఎడిఎస్‌)లు, నిఘా మరియు పర్యవేక్షణ పరికరాలు, ఆయుధాలు, క్షిపణులు పంపనున్నట్లు పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఇద్దరు అధికారులు తెలిపారు. తైవాన్‌కు ఆయుధాలను పంపాలని అమెరికా చట్టసభ సభ్యులు పెంటగాన్‌ మరియు వైట్‌హౌస్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. చైనాను ఎదుర్కోవడానికి తైవాన్‌కి సహాయం అందించడం, చైనాను ఎదుర్కోవడం లక్ష్యాలుగా అమెరికా తైవాన్‌కు ఆయుధాలు అందిస్తోంది. సుమారు 19 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఎఫ్‌ -16 (ఫైటర్‌ జెట్‌)లు, ఇతర భారీ ఆయుధాల కొనుగోళ్లతో పాటు అదనంగా ఈ ప్యాకేజీ అందించనున్నట్లు అమెరికా పేర్కొంది.
తమ దేశ భద్రతకు కట్టుబడిన అమెరికా నిబద్ధతకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తైవాన్‌ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం ఓ ప్రక టనలో తెలిపింది.