వాషింగ్టన్ : రష్యా - ఉక్రెయిన్‌ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని కొనసాగించే దిశగానే ఉక్రెయిన్‌ని అమెరికా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కిి ఆర్థికంగా కూడా సహాయపడుతోంది. తాజాగా 250 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీని అమెరికా ఉక్రెయిన్‌కి అందించింది. తాజాగా విడుదల చేసిన ఈ సైనిక ప్యాకేజీ యుద్ధ భూమిలో ఉక్రెయిన్ దళాలకు సహాయం చేస్తుందని వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జీన్- పియర్ చెప్పారు. ఈ ప్యాకేజీలో వాయు రక్షణ కోసం ఎఐఎం-9ఎం క్షిపణులు, గనిని గుర్తించే క్షిపణులు, జావెలిన్ క్షిపణులున్నాయి. ఇవి రష్యన్ కార్లపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటితోపాటు భవిష్యత్తులో హెచ్‌ఐఎంఆర్‌ఎస్ రాకెట్ వ్యవస్థకు సంబంధించిన మందుగుండు సామాగ్రి, 155 ఎంఎం, 105 ఎంఎం ఫిరంగి మందుగుండు సామాగ్రి, మూడు మిలియన్ రౌండ్లను కాల్చేలా చిన్న ఆయుధాల మందుగుండు సామాగ్రితో సహా వివిధ రకాల ఆయుధాలను కూడా ఉక్రెయిన్‌కి పంపనుంది. దీన్నిబట్టే యుద్ధం రష్యాలో కాదు.. ఉక్రెయిన్‌లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతుందని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నారు.