Sep 28,2023 14:58

న్యూఢిల్లీ : ఒక్క ఏడాదిలోనే దాదాపు లక్షకు పైగా వీసాలు జారీ చేసినట్లు అమెరికా ఎంబసీ తాజాగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. లక్షకుపైగా వలసేతరులకు వీసాలను మంజూరు చేసి.. లక్ష వీసాలను జారీ చేయాలనుకున్న లక్ష్యాన్ని యుఎస్‌ టు ఇండియా మిషన్‌ చేరుకుందని అమెరికా ఎంబసీ ప్రకటన వెల్లడించింది. గత సంవత్సరం 1.2 మిలియన్ల లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారని ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రయాణ సంబంధాలలో ఒకటిగా నిలుస్తుందని ఈ ప్రకటన పేర్కొంది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీసా దరఖాస్తుదారుల్లో భారతీయులు 10 శాతం మంది ఉన్నారని అమెరికా ఎంబసీ ప్రకటన పేర్కొంది. అలాగే 20 శాతం స్టూడెంట్‌ వీసాలు, హెచ్‌అండ్‌ ఎల్‌ కేటగిరి (ఎంప్లారుమెంట్‌) దరఖాస్తుదారులు 65 శాతం ఉన్నారని ఈ ప్రకటనలో పేర్కొంది. భారతీయులు అమెరికాను సందర్శించడానికి మొగ్గు చూపుతున్నందుకు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఆనందం వ్యక్తం చేశారు. భారత్‌ అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగ్గా ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు గార్సెట్టి తెలిపారు.