Jul 27,2023 22:13

వాషింగ్టన్‌ : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోమారు కీలక వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచి గత 22 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 5.50 శాతానికి చేర్చుతూ.. జులై 26న నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణంపై పోరాటం సాగుతుందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్‌పర్సన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. వరుసగా వడ్డీ రేట్ల పెంచుతూ.. రెండు దశాబ్దాల గరిష్టానికి చేర్చడంతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముదురుతుందనడానికి సంకేతాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.