May 01,2023 21:04

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్‌ స్థాయిలో రూ.14.07 లక్షల కోట్ల విలువ చేసే 890 కోట్ల యుపిఐ లావాదేవీలు జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) వెల్లడించింది. ఇంతక్రితం మార్చిలో ఈ సంఖ్య రూ.14.05 లక్షల కోట్లతో 870 కోట్ల లావాదేవీలుగా ఉంది. ఏప్రిల్‌ చివరి మూడు రోజుల్లోనే రూ.1.37 లక్షల కోట్ల విలువ చేసే100 కోట్ల లావాదేవీలు జరిగాయని ఎన్‌పిసిఐ తెలిపింది.. 2022 ఏప్రిల్‌లో రూ.9.8 లక్షల కోట్ల విలువ చేసే 558 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ప్రతీ నెల యుపిఐ లావాదేవీలు పెరుగుతూ.. నూతన రికార్డ్‌లను నమోదు చేస్తోన్నాయి.