ఆన్‌లైన్ కొనుగోళ్లలో తగ్గుతున్న డెబిట్ కార్డులు
న్యూఢిల్లీ : ఆన్‌లైన్ కొనుగోళ్లలో యుపిఐ చెల్లింపులకే వినియోగదారులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఆర్‌బిఐ విశ్లేషించింది. డెబిట్ కార్డుల వినియోగం క్రమంగా తగ్గుతోందని పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌లో ఇ-కామర్స్‌లో డెబిట్ కార్డుల లావాదేవీల సంఖ్య 11.7 కోట్లుగా ఉండగా.. ఇది 2023 సెప్టెంబర్ నెలలో సగానికి పైగా తగ్గి 5.1 కోట్లకు పడిపోయింది. లావాదేవీల విలువ మొత్తం రూ.21,000 కోట్ల నుంచి రూ.16,127 కోట్లకు తగ్గింది. అదే సమయంలో యుపిఐ చెల్లింపులు 22 లక్షల నుంచి ఏకంగా 61 లక్షలకు చేరింది. తక్కువ మొత్తం చెల్లింపులకు చాలా మంది యుపిఐ వైపు ఆసక్తి చూపుతున్నారు.