లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కేబినెట్ మంత్రుల్లో ఒకరైన పర్యావరణ మంత్రి జాక్ గోల్డ్‌స్మిత్ శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే తాను రాజీనామా చేయడానికి రిషి సునక్ కారణమని గోల్డ్‌స్మిత్ విమర్శించారు. నేరుగా తన రాజీనామా లేఖను రిషి సునక్‌కి పంపారు. ఈ లేఖలో పర్యావరణానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదు. కేవలం ప్రధానే (సునక్) పర్యావరణ విషయాల్లో ఆసక్తి చూపడం లేదని గోల్డ్‌స్మిత్ పేర్కొనడం గమనార్హం.