Oct 28,2023 15:10

కూకట్‌పల్లి: కాంగ్రెస్‌కి సీనియర్‌ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఇందులో కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ను శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు పార్టీ కేటాయించింది. దీంతో ఆ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన గొట్టిముక్కల కంటతడి పెడుతూ పార్టీకి గుడ్‌బై చెప్పారు.