Aug 12,2023 21:32

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో కొత్తగా రెండు 5జి స్మార్ట్‌పోన్లను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ నెల 28న జరగనున్న రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో వీటిపై జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ ప్రకటన చేస్తారని సమచారం. ఆ ఫోన్లకు ఇప్పటికే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బిఐఎస్‌) సర్టిఫికెట్‌ పొందినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. ఆయా ఫోన్ల ధరలు రూ.8వేల నుంచి రూ.12వేల మధ్య ఉండొచ్చని అంచనా.