న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి గెలాక్సీ ఎ సిరీస్‌లో కొత్తగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఎ54 5జి, ఎ34 5జిలను ఆవిష్కరించింది. ఎ54 5జిలో 8జిబి, 128 జిబి వేరియంట్ ధరను రూ.38,999గా, 8జిబి, 256 జిబి ధరను రూ.40,999గా నిర్ణయించింది. దీనిలో 50 ఎంపి కెమెరాను, సెల్ఫీ కోసం 32 ఎంపి కెమెరాను అమర్చింది. ఎ34 5జిలో రెండు వేరియంట్ల ధరలను రూ.30,999గా, రూ.32,999గా నిర్ణయించింది. దీన్ని 48ఎంపి ప్రైమరీ కెమెరా, 13 ఎంపి సెల్ఫీ కెమెరాతో ప్రవేశపెట్టింది. వీటి విక్రయాలను మార్చి 28 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.










