Jul 26,2023 22:05

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో :మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి రుతుపవన ద్రోణి బుధవారం తోడైంది. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. మత్స్యకారులెవ్వరూ చేపలవేటకు వెళ్లదని హెచ్చరించింది. 27న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరో రెండు రోజులు వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాత భవంతులను వీడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించింది.