Nov 22,2023 11:13

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని,అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మరో రెండు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్నిచోట్ల ఈదురుగాలులు కారణంగా కోతకువచ్చిన వరిచేలు ఒరిగిపోయాయి. దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.