Dec 03,2022 10:45

విశాఖ : గొల్లల ఎండడాలో విషాదం నెలకొంది. పని చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. శనివారం ఉదయం ఇంటి నిర్మాణం కోసం 30 అడుగుల గొయ్యి తవ్వుతుండగా మట్టి జారిపోవడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎండడా కు చెందిన జి.గోవింద్‌, విజయనగరం జిల్లాకు చెందిన అల్లు తిరుపతి గా గుర్తించారు. మృతదేహాలను కెజిహెచ్‌ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.