Sep 27,2023 20:52
  •  వినాయక నిమజ్జనంలో విషాదం

ప్రజాశక్తి-కురిచేడు (ప్రకాశం జిల్లా) : వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో బుధవారం జరిగింది. పొట్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్‌పై వినాయకుడిని తీసుకువెళ్తుండగా ట్రాక్టర్‌కి అమర్చి ఉన్న ఐరన్‌ పైపునకు విద్యుత్‌ తీగలు తగిలాయి. చమిడిశెట్టి శ్రీను (35), పడకండ్ల శ్రీ లక్ష్మీ నాగేంద్ర ఫణింద్ర కుమార్‌ (13) విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. హుటాహుటినా వీరిని వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే వీరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కురిచేడు ఎస్‌ఐ దేవకుమార్‌ తెలిపారు.