నరసరావుపేట (పల్నాడు) : నరసరావుపేటలో మంగళవారం జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపుని చూడటానికి వచ్చి కరెంటు షాకు తగిలి గణేష్ అనే 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గణేష్ మున్సిపల్ హైస్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










