May 22,2023 20:49

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి భారత మార్కెట్లోకి చౌక ధరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రెడ్మీ ఎ2, రెడ్మీ ఎ2ఫ్లస్‌ పేరుతో వీటిని ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధరలను వరుసగా రూ.5,999, రూ.8,499గా నిర్ణయించింది. ఈ మొబైల్స్‌కు రెండేళ్ల వారంటీ ఇస్తోన్నట్లు ఆ కంపెనీ తెలిపింది. మే 23 నుంచి వీటిని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో అమ్మకానికి సిద్దంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది.