హైదరాబాద్ : షావోమి ఇండియా కొత్తగా మార్కెట్లోకి రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రెడ్‌మి 12సి, రెడ్‌మి నోట్ 12ను ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 6నుంచి ఈ ఫోన్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. రెడ్‌మి 12సి డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ ప్రియులకు 5ఎంపి ఫ్రంట్ కెమెరాతో పాటు 50 ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. వీటి ధరలు రూ.10-15వేల మధ్య ఉండొచ్చని పేర్కొంది.










