
శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌లో ఇంటర్నల్‌గా ఉన్న సోర్స్‌కోడ్... ఆన్‌లైన్‌లో లీకైందని ఆ కంపెనీ అధినేత ఎలన్‌మస్క్ మండిపడ్డారు. ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ఆ కంపెనీ ఉద్యోగులను భారీసంఖ్యలో మస్క్ తొలగించిన సంగతి తెలిసిందే. సోర్స్‌కోడ్ లీకవ్వడం పట్ల ఎలన్‌మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కంపెనీ నిర్వహణకు కీలకమైన ఈ సోర్స్‌కోడ్.... కొన్ని భాగాలను సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్‌సైట్ గిట్‌హబ్‌లో షేర్ చేసినట్లు ట్విటర్ గుర్తించింది. అయితే, ట్విటర్ వినతి మేరకు ఈ కోడ్‌ను గిట్‌హబ్ తొలగించినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే ఎన్నిరోజుల కిందట ఈ కోడ్ లీకైందనే దానిపై స్పష్టత లేదు. ఈ కోడ్ గత కొన్నినెలలుగా ఆన్‌లైన్‌లో కనిపిస్తుందని గిట్‌హబ్ పేర్కొంది. ఇక ఈ విషయంపై ట్విట్టర్ కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టును సంప్రదించింది. ఈ కోడ్‌ను షేర్ చేసిన వ్యక్తిని, డౌన్‌లోడ్ చేసుకున్న వ్యక్తులను గుర్తించమని ఆదేశించాలని ట్విట్టర్ కోర్టును కోరింది.
కాగా, కంప్యూటర్ కోడ్ లీక్‌పై ట్విట్టర్ దర్యాప్తు ప్రారంభించింది. గత సంవత్సరం కంపెనీని వదిలివెళ్లిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లే ఈ లీకేజ్‌కి పాల్పడివుంటారని ట్విట్టర్ అభిప్రాయపడుతోంది. ఈ కోడ్ లీకేజ్ వల్ల 20 బిలియన్ డాలర్ల మేర ఆర్థికంగా నష్టం చేకూరిందని ఉద్యోగులకు ఎలన్‌మస్క్ సమాచారం ఇచ్చారు.