Feb 17,2023 21:21

శాన్‌ప్రాన్సిస్కో : సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ భారత్‌లోని తన మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసి వేస్తున్నట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ, ముంబయిలోని ఆఫీసులను మూసివేస్తుందని రిపోర్టులు వస్తున్నాయి. ఈ కార్యలయాలో పని చేస్తున్న సిబ్బందిని ఇంటి నుంచి పని చేయాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా.. ఎక్కువ మంది టెక్‌ ఇంజనీర్లు పని చేస్తున్న బెంగళూరులోని కార్యాలయాన్ని మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. ట్విట్టర్‌ను ఎలన్‌ మస్క్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సగం పైగా ఉద్యోగులను తొలగించారు. భారత్‌లో ఏకంగా 90 శాతం మంది సిబ్బందికి కోత పెట్టారు.