Sep 23,2023 21:50

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా దిగ్గజం ఎక్స్‌(ట్విట్టర్‌) ఇండియా, సౌత్‌ ఏసియా పాలసీ హెడ్‌ సమీరన్‌ గుప్తా అనుహ్యాంగా తన పదవీకి రాజీనామా చేశారు. పలు కోర్టు వివాదాలు, వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న వేళ ఎక్స్‌లోని ఓ ప్రధాన బాధ్యుడు వైదొలగడం గమనార్హం. కంటెంట్‌ తొలగింపు విషయంలో ఎక్స్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య న్యాయ వివాదాలు నెలకొన్నాయి. అనేక మార్లు కంటెంట్‌ తొలగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోన్నప్పటికీ ఎక్స్‌ తొలగించడం లేదన్నది ఆరోపణ. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలు వేళ కంటెంట్‌ విషయంలో మున్ముందు భారీ సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో సమీరన్‌ వైదొలిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.