Sep 21,2023 21:47

బెంగళూరు : ప్రముఖ ఫోన్‌ నెంబర్ల గుర్తింపు యాప్‌ ట్రూకాలర్‌ కార్పొరేట్‌ రీబ్రాండింగ్‌లో భాగంగా కొత్త లోగోను ఆవిష్కరించినట్లు తెలిపింది. శక్తి, ఉత్సాహం దీని ప్రధాన ఉద్దేశ్యమని ఆ సంస్థ వ్యవస్థాపకులు, సిఇఒ అలాన్‌ మామెడి తెలిపారు.''మా కొత్త బ్రాండ్‌ గుర్తింపు, లోగోను ఆవిష్కరించుటకు మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతిరోజు నిరంతరంగా అభివృద్థిని మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాము.'' అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 35.6 కోట్ల మంది ట్రూకాలర్‌ను వాడుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.