
ప్రజాశక్తి-ఉండి(పశ్చిమగోదావరి) : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమంలో ఉండి గ్రామ పార్టీ అధ్యక్షుడు కరిమెరక మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇందుకూరి శ్రీహరి నారాయణ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడిద వెంకటేశ్వరరావు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్తును అందించి రైతుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. నిరుపేదలకు ఖరీదైన విద్య, వైద్యం దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తీసుకువచ్చి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడని అన్నారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్ కొర్రపాటి అనిత, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, రణస్థుల మహంకాళి, గుండాబత్తుల సుబ్బారావు, కరిమెరక శివనాగరాజు, బడుగు బాలాజీ, శేషాద్రి శ్రీనివాస్, అందుకూరి రాజు, రాయి సతీష్, మల్లువలస సత్యనారాయణ, గెద్ద రవికుమార్, షేక్ కన్నా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.