
పార్వతీపురం సీతాపట్నం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర శనివారానికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా కె.డి పేటలోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధి వద్ద ప్రజా రక్షణ భేరి బృందం నివాళులర్పించింది. అలాగే ప్రజానాట్యమండలి కళాకారులు పాటలు పాడారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'మన్యం వీరుడి బాటలోనే మేమంతా అల్లూరి ఆశయ సాధనలో అడుగులేస్తూ గిరిజనులను అణచివేసే విధానాలపై పోరాడుతున్నాం అల్లూరి స్మృతి చిహ్నాన్ని టూరిజం కేంద్రంగా మార్చాలి' అన్నారు.

