
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ తొలి వికెట్‌కు 175 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ (109: 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. డేవిడ్ వార్నర్ (81: 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, కివీస్ బౌలర్లు పుంజుకుని వీరిద్దరిని పెవిలియన్‌కు చేర్చారు. ఆ తర్వాత వచ్చిన ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (36) కాసేపు పోరాడాడు. స్టీవ్ స్మిత్ (18), లబుషేన్ (18) నిరాశపరిచినా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (41.. 24 బంతుల్లో 2 సిక్స్‌లు, 3 ఫోర్లు, ఇంగ్లిస్ (38.. 1 సిక్స్.. 4 ఫోర్లు), కెప్టెన్ పాట్ కమిన్స్ 37.. 14 బంతుల్లో 4 సిక్స్‌లు, 2ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా పరుగులేమి చేయకపోవడంతో ఆసీస్ 49.2 ఓవర్లు అలౌటయ్యింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 3, గ్లెన్ ఫిలిప్స్ 3, మిచెల్ శాంట్నర్ 2.. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ తీశారు.