మహారాష్ట్ర : మహారాష్ట్రలో అహ్మద్ నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురైంది. రైలులోని 5 కోచులకు మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించడానికి ముందే రైలులోని ప్రయాణికులను సురక్షితంగా బయట పడ్డారు. ఈ ఘటన ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా గార్డ్ సైడ్ బ్రేక్ వ్యాన్‌లో మంటుల చెలరేగినట్లు తెలిపారు. వెంటనే పక్కనే ఉన్న నాలుగు కోచులకు మంటలు వేగంగా వ్యాపించాయని, మంటలు చుట్టుముట్టే ముందే బయటపడ్డామని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఇతర బోగీలకు అంటుకోకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతానికి గాయాలు, ప్రాణనష్టం గురించిన సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.దౌండ్ నుంచి రైల్వే యాక్సికెండ్ రిలీఫ్ ట్రైన్, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.










