Oct 24,2023 07:52

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కిషోర్‌గంజ్‌లో ప్యాసింజర్‌ రైలు, గూడ్స్‌ రైలును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 100 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రోజున రాజధాని ఢాకాకి 80 కిలోమీటర్ల దూరంలో భైరబ్‌ వద్ద జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరబ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారి సిరాజుల్ ఇస్లాం తెలిపారు. రైలు కింద పలువురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది కోచ్‌ల కింద పడి ఉన్నారని.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తరలించడంలో స్థానిక ప్రజలు కూడా సహాయం చేస్తున్నారు. 

2