ప్రజాశక్తి-నందిగామ : వరదల కారణంగా కష్టా జిల్లాలోని ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. మున్నేరు వాగుకు వరద తగ్గుముఖం పడటంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై యథావిధిగా వాహనల రాకపోకలు కొనసాగుతున్నాయి. మున్నేరు వరద తగ్గడంతో వాహనాలను పోలీసులు అనుమతించారు. వరద కారణంగా రహదారిపై గుంటలు పడి బురద మేట వేసింది. శనివారం కీసర స్వర్ణ టోల్ సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. వాటరు ట్యాంకర్ల ద్వారా జాతీయ రహదారిని శుభ్రం చేస్తున్నారు.










