బెంగళూరు : టయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) తన నూతన రూమియన్ కోసం బుకింగ్‌లను తెరుస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఆవిష్కరించిన ఈ కారు ఎక్స్‌షోరూం ధరను రూ.10.29 లక్షల నుంచి రూ.13.68 లక్షలుగా నిర్ణయించింది. ఆరు గ్రేడ్‌లలో అందుబాటులో ఉన్న ఈ అసాధారణమైన కొత్త కాంపాక్ట్ బి-ఎంపివి అద్భుతమైన ఇంధన సామర్థ్యం, ఆకర్షణీయమైన, ప్రీమియం బాహ్య డిజైన్ ఫీచర్లతో తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 8 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయని అంచనా. సరికొత్త టొయోటా రూమియన్‌ను రూ.11,000 టోకెన్ మొత్తానికి తమ సమీప డీలర్ అవుట్‌లెట్ లేదా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.










