యిప్పుడిక
మట్టి తన గురించి తనే మాటాడుకోవాలి!
నీరు తానే పల్లమై పదిమందికి పంచుకోవాలి!
అడవి తానే పాటై నలుదిశలా వినపడాలి...
ఎవరికి వారే గొంతు విప్పాల్సిన సమయమిది!
గోడు వినిపించాల్సిన సమయమిది!
కతలు కలబోసుకోవాల్సిన కాలమిది...
రాజ్యంతో పాటు కాలం కూడా తలారి పాత్ర
యింత నిర్దయగా నిర్వహిస్తున్న సమయంలో
ఇంకెవరికోసమో వేచి వుండాల్సిన కాలం కాదిది...
రా నేస్తం
మన దారి మనమే వెతుక్కుంటూ
చీకటి తెరలను తొలగించే
వెలుతురు వైపు పయనిద్దాం!
- కెక్యూబ్ వర్మ
94934 36277










