
తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని సుసంపన్నమైన, వైవిధ్యమైన వారసత్వాన్ని పెంపొందించేందుకు, ముఖ్యమైన ఆరాధనా స్థలాలను ప్రముఖంగా ప్రచారం చేస్తూ, మైక్రోసైట్‌లను తీసుకురానున్నట్లు కేరళ పర్యాటకా విభాగం ప్రకటించింది. ఇందులో భాగంగా శబరిమలపై వివిధ భాషల్లో విస్తృత సమాచారాన్ని అందచేస్తున్న మైక్రోసైట్‌ను త్వరలో ఆవిష్కరించనున్నారు. పతనంతిట్ట జిల్లాలోని శబరిమలపై పునరుద్ధరించిన మైక్రోసైట్‌లో ఐదు భాషలు ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడ, తెలుగుల్లో సమద్ర సమాచారం వుంటుంది. రూ.61.36లక్షల వ్యయంతో చేపట్టు ఈ ప్రాజెక్టులో ఇ బ్రోచర్లు వుంటాయి. ఇదికాకుండా, ఆ సైట్‌లో ఒక చిత్రం కూడా వుంటుంది. అయ్యప్ప దేవాలయాన్నిఏటా లక్షలాదిమంది భక్తులు సందర్శించుకుంటున్నందున ఇక్కడకు జరిపే పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వుండేలా చూసేందుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది.