
ప్రధాని ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు కానీ మణిపూర్‌లో పర్యటించడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ఇంత జరిగినా కూడా ప్రధాని మోడీ, మణిపూర్ ముఖ్య మంత్రిలు జవాబుదారీతనం వహించేందు కు సుముఖంగా లేరని తృణమూల్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా విమర్శించారు. తక్షణమే ముఖ్యమంత్రిని గద్దె దిగాల్సిందిగా బిజెపి కోరాలని తమిళనాడు మంత్రి తంగమ్ తెన్నరసు కోరారు.