నీళ్ళ కోసం
కంటి నిండా కన్నీళ్ళు
విద్యుత్ కోసం
రోజంతా నిరీక్షణ
ధరల విఘాతాలకు
విలవిలలాడుతున్న
జన జీవనం
ఉద్యోగం, ఉపాధి లేక
వలస పక్షుల్లా యువత
విషపు కోరలతో
కాటేస్తున్న కల్తీ మద్యం
కులమత వైషమ్యాలతో
రక్త సిక్తమవుతూ
ప్రజానీకం
కామాంధుల దాడిలో
ప్రాణాలు విడుస్తున్న
మహిళా లోకం
విలువలు కోల్పోతున్న
ప్రజాస్వామ్యం
న్యాయ వ్యవస్థకే
రక్షణ లేని వైనం
ఓటు వేసిన
తప్పిదానికి
ఐదేళ్ళు జీవన్మరణ శిక్ష.
- కయ్యూరు బాలసుబ్రమణ్యం










