ఆచార్య పులికొండ సుబ్బాచారి రచించిన రేవు తిరగబడితే నవలని ఈనెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం జాకీర్ హుసేన్ హాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరిస్తారు. వీసీ ఆచార్య బిజె రావు అధ్యక్షత వహించగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, మామిడి హరికృష్ణ, కొప్పర్తి వెంకట రమణమూర్తి, దార్ల వేంకటేశ్వరరావు, కోయి కోటేశ్వరరావు ప్రసంగిస్తారు. సెంటర్ ఫర్ దళిత్ ఆదివాసీ స్టడీస్, తెలంగాణ భాషాసాంస్క ృతిక శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.










