- నేడు ఆస్ట్రేలియాతో మూడో, చివరి వన్డే
- మధ్యాహ్నం 1.30గం||ల నుంచి
రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో నెగ్గిన టీమిండియా ఇక క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగే మూడో, చివరి వన్డేలోనూ గెలిచి వన్డే ప్రపంచకప్‌కు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగాలని యోచిస్తోంది. సిరీస్‌ను ఇప్పటికే చేజిక్కించుకున నేపథ్యంలో రొటేషన్ పద్ధతిలో ఆసీస్‌తో తలపడాలని భావిస్తే శుభ్‌మన్, షమీ, శార్దూల్‌లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ఇక మూడో వన్డేకు అక్షర్ పటేల్ దూరం కావడంతో అతని స్థానంలో హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చేరనున్నాడు. తొలి రెండో వన్డేలకు దూరమైన కోహ్లి, రోహిత్ మూడో వన్డే బరిలోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. శుభ్‌మన్ విశ్రాంతి తీసుకుంటే రోహిత్‌తో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. ఓపెనర్‌గా ఇషాన్ 74.66 సగటుతో 448పరుగులు చేశాడు. ఇండో వన్డేలో సెంచరీతో కదం తొక్కిన శ్రేయస్ మూడో వన్డేలోనూ ఆడడం ఖాయం. అక్షర్ పటేల్ దూరం కావడంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగడం ఖాయం. అతడు రెండు గేమ్‌లలో నాలుగు వికెట్లను కూల్చాడు.
ఇక ఆస్ట్రేలియా జట్టు విషయానికొస్తే.. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న మిఛెల్ స్టార్క్ ఈ వన్డేలో ఆడడం ఖాయం. గ్లెన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్ మంగళవారం నెట్ ప్రాక్టీస్‌లో కఠోర సాధన చేశారు. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే వరుసగా ఐదు వన్డేలో ఓడి ఆసీస్ అభిమానులను నిరాశపరుస్తోంది. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ జట్టుకు గెలుపు తప్పనిసరి. ఆసీస్ జట్టు పవర్-ప్లే, డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగుతు సమర్పించుకోవడం కెప్టెన్‌కు తలనొప్పిగా మారింది. ఇక డేవిడ్ వార్నర్ రెండు వన్డేల్లోనూ అర్ధసెంచరీలతో కదం తొక్కడం ఊరటనిచ్చే అంశం.
జట్లు(అంచనా)..
భారత్: రోహిత్(కెప్టెన్), ఇషాన్(వికెట్ కీపర్), కోహ్లి, శ్రేయస్, సూర్యకుమార్, హార్దిక్, అశ్విన్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్, సుందర్/జడేజా.
ఆస్ట్రేలియా: స్మిత్(కెప్టెన్), షార్ట్, వార్నర్, లబూషేన్, ఇంగ్లీస్, గ్రీన్, స్టార్క్, కమిన్స్, మ్యాక్స్‌వెల్, మార్ష్, స్టొయినీస్/జంపా.










