ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు పోలీసులు నోటీసులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టిడిపి నాయకులు బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. ఎవరు బయటకు రాకుండా నేతల ఇళ్ల వద్ద పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. బాపట్ల పట్టణ టిడిపి కార్యాలయం వద్ద చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పట్టణ ఎస్సై మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.










