
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ దారుణం జరిగింది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్‌పూర్ జిల్లా అంబాగర్ చౌకీ పట్టణంలో బీజేపీ నేత బిర్జు తారామ్‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. గత రాత్రి బిర్జు తారామ్ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు అగంతకులు 3 రౌండ్ల కాల్పులు జరిపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది మావోయిస్టులే అని ఇప్పుడే చెప్పలేమని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రత్న సింగ్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.